01-04-2025 12:50:50 AM
మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, మార్చి 31 (విజయక్రాంతి): తెలంగాణ స్వరాష్ట్రంలో మైనార్టీల అభ్యున్నతికి కేసిఆర్ మాత్రమే కృషి చేశారని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.గత పది యేండ్లలో హిందువుల అభ్యున్నత కోసం ఏ విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడ్డారో, మైనారిటీల అభ్యున్నతి కోసం అంతే పాటుపడ్డారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు పైకి వచ్చేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా సిద్దిపేట ఎక్బల్ మినార్ వద్ద ముస్లిం సోదరులను అలయ్ బలాయ్ చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కుల మతాలకతీతంగా సోదర భావంతో ఒకరి పండుగల్ని ఒకరు, ఒకరి సంప్రదాయాన్ని మరొకరు గౌరవిస్తూ ఎంతో సఖ్యతతో జీవిస్తారని చెప్పారు. కొన్ని శక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందరూ ఓపికతో, శాంతితో, సౌభాగ్యంతో కలిసి మెలసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సోదర భావంతో అందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు.