calender_icon.png 6 March, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా

10-12-2024 01:58:32 AM

విగ్రహావిష్కరణకు బీఆర్‌ఎస్, బీజేపీ గైర్హాజరు 

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు గైర్హాజరయ్యారు. తొలిరోజు సమావే శాలకు వచ్చి తెలంగాణ తల్లి విగ్రహ మార్పు పై నిలదీస్తారని అధికార పార్టీ నేతలు అంచ నా వేశారు. అందుకు తగ్గట్టుగా కేసీఆర్ విమర్శలను ఎదుర్కొనేందుకు అస్త్రాలు సిం చేసుకున్నారు.

ఆరు గ్యారెంటీలు, లగచర్ల భూసేకరణ, రైతుభరోసా, రుణమాఫీ, పింఛన్ల అంశంపై కేసీఆర్ గళం విప్పుతారని ప్రజలు కూడా ఎదురు చూశారు. ఆయన మాత్రం ఫామ్‌హౌస్ నుంచి అడుగు బయటపెట్టలేదు. సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహా విష్కరణకు కూడా రాలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభలోకి రాలేదు.  

 బీజేపీ నేతలు దూరం

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీజేపీ నేతలు హాజరుకాలేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందించారు. పార్లమెంటు సమావేశాల కారణంగా తాను రాలేకపోతున్నానని కిషన్‌రెడ్డి సమాచారం అందించారు.