15-04-2025 12:22:30 AM
అయినా కేసీఆర్ ధైర్యంగా ముందడుగు వేసి అమలుచేశారు
రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఆలోచన చేయరు
అంబేద్కర్ జయంతి వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాం తి): దళితబంధు వల్ల పార్టీకి కొంత నష్టం జరిగిందని, అయినా పథకం అమలుకు కేసీఆర్ ధైర్యంతో ముందడుగు వేశారని బీఆ ర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ చూడలేదని, మంచి ప్రయత్నాలు చేసి నప్పుడు నష్టం జరిగినా పట్టించుకోవద్దని అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ తెలంగాణభవన్‌లో అంబేద్కర్ చిత్రపటానికి కేటీఆర్, పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. చేవేళ్ల డిక్లరేషన్‌లో ఏ హామీని కాంగ్రెస్ అమ లు చేయలేదని, రేవంత్‌రెడ్డిలాంటి నేత చెప్తే ప్రజలు నమ్మరని ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని మల్లికార్జున్ ఖర్గేతో ప్రకటింపజేశారన్నారు. ఖర్గే మాటలు నమ్మి ఓటేసిన ప్రజలకు ఆయ నే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ 12 లక్షల దళితబంధు పథకం ఏమైందని, రూ.6లక్షలు సొంత ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పారని, ఆ హామీలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.
విద్యాజ్యోతి పథకం కింద దళితులకు ఇస్తామని చెప్పిన ఆర్థిక ప్రోత్సాహకాలు ఎటుపోయాయని విమర్శించారు. ఎస్సీ డిక్లరేషన్ అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నేటి కాం గ్రెస్ పాలన చూస్తే రాజ్యాంగ నిర్మాతలు రీకాల్‌ను తీసుకువచ్చేవారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రజా సునామీలో కొట్టుకుపోతుందన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆర్టికల్ 3ను పొందుపర్చి తెలంగాణకు అం బేద్కర్ మార్గం సుగమం చేశారని అన్నారు.
కాంగ్రెస్ అంటేనే కరువు..
కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కేసీఆర్‌పై ఉన్న కక్షతో రిజర్వా యర్లు, చెరువులు, కుంటలు నింపకుండా కాం గ్రెస్ సర్కార్ పాపం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇది కాలం పెట్టిన శాపం కాదని, ఇది తెలంగాణకు కాంగ్రెస్ పెట్టిన శఠగోపం అని ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణలోని నీళ్ల పరిస్థితులపై ఆయన స్పందించారు.. నిర్లక్ష్యంతో పాలమూరుెేరంగారెడ్డి ఎత్తిపోతల పనులను పక్కనపెట్టారని, గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరదలు వచ్చినా నీటిని ఒడిసిపట్టుకోకుండా వదిలేశారని దుయ్యబట్టారు. మరోవైపు బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు రావాలని ఆహ్వానపత్రిక ముద్రించి ఇంటింటికీ వెళ్లి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ము ఖారా గ్రామ సర్పెంట గాడ్గే మీనాక్షీ సుభాష్ ప్రజలను ఆహ్వానిస్తున్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ చెప్పారు.