calender_icon.png 29 November, 2024 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ దీక్ష చారిత్రాత్మకం

29-11-2024 12:54:23 PM

దీక్ష దివాస్ తో దిగివచ్చిన కేంద్రం.. ప్రత్యేక రాష్ట్రం ప్రకటన 

బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ దేవి ప్రసాద్ 

సంగారెడ్డి, (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక దీక్ష దివాస్ చేయడంతోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిని బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ దేవి ప్రసాద్ రావు తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని కంది గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసి చరిత్రలో నిలిచిపోవడం జరిగింది అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని భావితరాలకు తెలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఎన్నో పోరాటాలతో వచ్చిందని, ఆ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ అభివృద్ధికి కురియాలన్నారు. పది సంవత్సరాలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి చేసిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 11 నెలల్లో విధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి , డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.