calender_icon.png 19 March, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతుల సమస్యకు పరిష్కారం చూపలేదు

19-03-2025 01:01:43 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లారెడ్డి

కుత్బుల్లాపూర్, మార్చ్ 18(విజయ క్రాంతి):కెసిఆర్ పదేండ్ల పాలనలో రైతుల సమస్యకు పరిష్కారం చూపలేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి అన్నారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్-గండిమైసమ్మ మండల పరిధి భౌరంపేట్ గ్రామ రైతుల ఆవేదన మేరకు భౌరంపేట్ లో భూములకు కంజర్వేషన్ జోన్  తీసివేయాలని  ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి  బీజేపీ జిల్లా అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి సూచన మేరకు దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తులు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి మాట్లాడుతూ 2012 సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు జోన్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అప్పుడు రైతులకు వ్యతిరేకంగా జోన్ల నిర్ధారణ చేశారన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనె మల్లారెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి డి. విగ్నేశ్వర్,నల్ల రామచంద్రరెడ్డి,ఏ. మల్లేష్ యాదవ్,సర్గారి సత్తిరెడ్డి,మాజీ ఎంపీటీసీ జంగారెడ్డి,డి.ప్రభాకర్ రెడ్డి,డి.సీతారాం రెడ్డి,ఎం.జంగారెడ్డి,వై.శ్రీనివాస్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు