calender_icon.png 11 January, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతాప సభకూ కేసీఆర్ రాకపాయే

31-12-2024 03:07:48 AM

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): అసెంబ్లీలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి సంతాపంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారనే అంశంపై విస్తృత చర్చ జరిగింది. శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కు కూడా కేసీఆర్ సమాచారం చేరవేశారనే ప్రచారం జరిగింది.

ఎందుకంటే మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండగా, ఆయన మంత్రి వర్గంలో కేసీఆర్ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కూడా మన్మోహన్‌సింగ్ హయాంలోనే సాధ్యమైన విషయం తెలిసిందే.

దీంతో మన్మోహన్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధం ఉండేదని ఆ పార్టీ నాయకులు చెప్పిన సంద్భాలున్నాయి. ఇటీవల జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. అయితే మన్మోహన్‌సింగ్‌కు ప్రకటించే సంతాప సభకు కచ్చితంగా వస్తారని అందరూ భావించినా.. కేసీఆర్ రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.