హైదరాబాద్: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారని కేసీఆర్ పేర్కొన్నారు. పీర్ల పండగ హిందూ, ముస్లింల ఐక్యతను గుర్తు చేస్తోంది కేసీఆర్ అన్నారు. మొహర్రం.. తెలంగాణ గంగా, జమున సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడేందుకు మరింతగా కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.