calender_icon.png 15 January, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారాం ఏచూరి మృతిపట్ల కేసీఆర్ సంతాపం

12-09-2024 06:12:03 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సీతారాం ఏచూరి మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి, విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్య సభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని, ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.