calender_icon.png 23 February, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి నియోజకవర్గంలో ఘనంగా కేసిఆర్ 71వ జన్మదిన వేడుకలు

17-02-2025 06:19:31 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాజీ దుర్గం చిన్నయ్య సమక్షంలో కేట్ కట్ చేసి వేడుకల్లో పాలుపంచుకున్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి మొక్కలు నాటారు.

కాసిపేట, కన్నెపల్లి మండలాల్లో బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ అధ్యక్షులు నూనేటి సత్యనారాయణ, బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్, మాజీ ఎంపీపీ సుభాష్ రావు, సీనియర్ నాయకులు కొమ్మెర లక్ష్మణ్ ,పట్టణ యూత్ ప్రెసిడెంట్ సబ్బని అరుణ్, మైనార్టీ ప్రెసిడెంట్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.