11-03-2025 01:43:46 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీ, మండలిల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.