* మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
నల్లగొండ, జనవరి 4 (విజయక్రాంతి): అవినీతి, అక్రమాలకు కొమ్ముకాసిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఉదారంగా వ్యవహరిస్తున్నారని తానైతే ఎప్పుడో జైల్లో పెట్టేవాడినని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఓ మీడియాతో ఆయన మాట్లాడారు.
పార్టీ ఫిరాయింపులను పోత్సహించిందే కేసీఆర్ అని, నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు పదవులు ఆశచూపి బీఆర్‌ఎస్‌లోకి చేర్చుకున్నారన్నారు. కేసీఆర్ చేస్తే ఒప్పు.. తాము చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలుండవని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో ఉండాల్సిన విపక్ష నేత ఫాంహౌజ్‌లో పడుకుంటే ఏం ప్రయోజనమని వ్యాఖ్యానించారు.