08-02-2025 12:25:18 AM
ఒక్కొక్కరితో విడివిడిగా చర్చలు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): క్యాబినెట్ విస్తరణ, పీసీసీ కూర్పు అంశంపై ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా హస్తినా పర్యటనకు వెళ్లారు. ఈక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ ముఖ్యనేతలతో విడివిడిగా చర్చలు జరిపినట్టు సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు, ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చా ర్జి దీపాదాసు మున్షీతోనూ చర్చించారు. పీసీసీ కార్యవర్గం కూర్పు, తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నేతల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిసింది.
సామాజిక సమీకరణాలను బేరీజు వేసు కొని అటు క్యాబినెట్, ఇటు పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం. క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదని సీఎం స్పష్టత ఇచ్చేశారు. మరీ పీసీసీ కూ ర్పు ఎలా ఉండబోతోందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఈక్రమంలోనే ఒకటీరెండు రోజుల్లో అధి కారికంగా పీసీసీ కార్యవర్గం ప్రకటించనుండగా, అందులో సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకొని స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మాదిగ, లంబాడా, రెడ్డి, ముస్లిం వర్గాలతో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌లను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు మరో 15 నుంచి 20 వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయనతో సీఎం చర్చించినట్టు సమాచారం.
అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ, పార్టీ పనితీరు గురించి ఖర్గేకు వివరించినట్టు తెలిసింది. అనంతరం పీసీసీ మాజీ అధ్య క్షుడు మల్లు అనంతరాములు వర్ధంతిని పురస్కరించుకుని రేవంత్ ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.