calender_icon.png 7 February, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ముఖ్యనేతలతో కేసీ వేణుగోపాల్ విడివిడిగా చర్చలు

07-02-2025 04:42:47 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): కాంగ్రెస్ ముఖ్యనేతలతో కేసీ వేణుగోపాల్ విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నిటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు.  పీసీసీ కార్యవర్గం కూర్పుపై ప్రధానంగా చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో పీసీసీ కార్యవర్గం ప్రకటించనున్నట్లు సమాచారం. నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు ఉండవచ్చని తెలిపిన కాంగ్రెస్ వర్గాలు మంత్రివర్గ మార్పులపై ఎలాంటి సమాలోచన చేయలేదని వెల్లడించాయి. ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ లేదని కాంగ్రెస్ ముఖ్యనేతలు తెలిపారు.