30-03-2025 12:00:00 AM
ఏప్రిల్ 1న హెడ్గేవార్ జయంతి
కొంతమంది మహాపురుషులు భవిష్య త్తు గురించి సత్యాన్ని గ్రహిస్తారు. దృఢమైన ఆత్మబలం, విశ్వాసంతో ముందు తరాలకు మార్గ నిర్దేశనం చేస్తారు. సమాజ హితమే ల క్ష్యంగా జీవితాన్ని అంకితం చేస్తారు. అలాం టి వారిలో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థపాకులు కేశవ్ బలిరాం హెడ్గేవార్ ఒకరు. హెడ్గేవార్ బోధనలు, చూపిన మార్గం నేటికీ సమాజా న్ని ప్రభావితం చేస్తున్నాయి. హిందూ సమా జ సంఘటనకు, ఐక్యతకు, ప్రస్తుత వికసిత భార త్ లక్ష్యసాధనకు ఆయన మార్గం స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.
హిందూ జాతీయవాద సంస్థ (ఆర్‌ఎస్‌ఎస్)ను హె డ్గేవార్ మహారాష్ట్రలోని నాగపూర్ లో 1925లో స్థాపించారు. ఆయనపై అజా ద్ హింద్ ఫౌజ్ వంటి జాతీయవాద ఉద్యమాల ప్రభావం ఎక్కువ. స్వామి వివేకా నం ద, బాల గంగాధర్ తిలక్ వంటి మహానాయకుల ఆలోచనలకు ప్రభావితమైనారు. పరా యి పాలన నుంచి దేశ విముక్తి, ధర్మ రక్షణ కోసం జరిగిన ఉద్యమాల్లో క్రియాశీలకంగా పని చేశారు. నాగపూర్ పట్టణంలో గుప్పెడు మందితో ప్రారంభమైనఆర్‌ఎస్‌ఎస్ నేడు ప్ర పంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవాసంస్థ గా ఎదిగింది. దేశం నలుమూలల్లో 80 వేల శాఖల్లోని లక్షలాది స్వయం సేవకులు నిత్యం భారతీయ సంస్కృతీ వారసత్వాల పురోభివృద్ధికోసం కృషి చేస్తున్నారు. వ్యక్తిత్వ నిర్మాణా నికి, వికాసానికి, ఐక్యతా శక్తికి వేదికగా ఆర్‌ఎస్‌ఎస్‌ను మార్చిన రూపశిల్పి హెడ్గేవార్. ఆయన గొప్ప సంఘసంస్కర్తగా కూడా గు ర్తింపు పొందారు.
-నేదునూరి కనకయ్య