26-03-2025 12:00:00 AM
నాగల్ గిద్ద,మార్చి 25 : నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిని శంషాబాద్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి కాయకల్ప వైద్య బృందం పరిశీలించింది. మంగళవారం ఆసుపత్రిలోని పరిసరాలు ,పారిశుద్ధ్యం, రసాయన పదార్థాల ద్వారా రోగాల నివారణకు చేపట్టే సహాయక చర్యలు, ఆసుపత్రిలో రోగులకు అందించే వైద్యం, వైద్యులు, సిబ్బంది తీసుకునే జాగ్రత్తలను పారిశీలించారు. వ్యర్ధ రసాయన పదార్థాల తొలగింపుకు చేపట్టే జాగ్రత్తలు , తదితర అంశాలను ఆసుపత్రిలో కాయకల్ప్ బృందం పరిశీలించింది. ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్ లో వైద్య పరికరాలకు రసాయనలతో తీసుకునే జాగ్రత్తలు తెలుసుకున్నారు .
కేంద్ర ప్రభుత్వ అనుబంధంలో కొనసాగుతున్న కాయకల్ప్ ప్రారంభమైందని ఆసుపత్రి డాక్టర్లు అనూరాధ, స్వప్నాలు తెలిపారు. ఇక్కడి పరిసరాలు కాయకల్ప్ బృందానికి సంతృప్తికరంగా ఉంటే ఈ ఆసుపత్రికి మరింత నిధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ అనురాధ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసుపత్రి కాయకల్ప్ బృందం డాక్టర్ పద్మాలత ,వైద్యులు అమూల్యరాణి, ప్రవీణ్ కుమార్ , రాధాకృష్ణ, తోడ్పాటు అందిస్తున్నారు. కరస్ గుత్తి ఆసుపత్రి కాయకల్ప బృందం సంతృప్తి కలిగించిందని అన్నారు. నర్సింగ్ ఆఫీసర్ శ్రీదేవి , నర్సింగ్ ఆఫీసర్లు శ్రీనివాస్ రెడ్డి, కరణ్, జ్ఞానేశ్వర్, వైద్య సిబ్బంది,శానిటేషన్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.