28-03-2025 12:29:13 AM
గజ్వేల్, మార్చి 27 : గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో గురువారం కాయకల్ప అసెస్మెంట్ నిర్వహించారు. హైదరాబాద్ గోల్కొండ ప్రభుత్వ దవాఖాన వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాయకల్ప బృందం గజ్వేల్ దవాఖానను పరిశీలించారు.
దవాఖానలోని వివిధ వార్డులు ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, స్వచ్ఛత నిర్వహణ, వేస్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాలలో దవాఖాలను క్షుణ్ణంగా పరిశీలించి గ్రేడింగ్ చేశారు. నివేదికను ఉన్నతా ధికారులకు సమర్పించనున్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ అన్నపూర్ణ పీడియాట్రిక్ రాము, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. కాగా ఇప్పటికే కాయకల్ప అవార్డుకు గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి రెండుసార్లు ఎంపికైంది.