calender_icon.png 29 March, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప వైద్య సిబ్బంది టీం

24-03-2025 03:46:24 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కాయకల్ప వైద్య సిబ్బంది టీం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని శానిటేషన్ ఆహార సరఫరా ఆరోగ్యశ్రీ సేవలు, డయాలసిస్, పడకల మెయింటెనెన్స్, తగు వసతుల పరిశీలన చేశారు. ఈ మేరకు వైద్య బృందం ఆస్పత్రి కావాల్సిన అవసరతలు, ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బృందం హెడ్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఆసుపత్రిని పరిశీలించామని తగు వసతులు కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. బృందంలో డాక్టర్ దీక్షిత, ఫార్మసిస్టు లు సాయికిరణ్, శ్రీనివాస చారి, స్టాఫ్ నర్స్ దయామని తదితరులు ఉన్నారు.