calender_icon.png 9 January, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరు తగ్గించిన కావ్య థాపర్..

05-01-2025 12:27:40 AM

రాగానే చకచకా కొన్ని సినిమాలు చేసేసి సైలెంట్ అయిపోతుంటారు కొందరు ముద్దుగుమ్మలు. అలాంటి వారిలో కావ్య థాపర్ ఒకరు. ‘బిచ్చగాడు 2’, ‘ఈగల్’, ‘ఊరు పేరు భైరవకోన’ అంటూ వరుసగా కొన్ని సినిమాలు చేసేసింది. రిజల్ట్ అయితే ఆశించిన స్థాయిలో లేదు కానీ అందంతో మాత్రం కుర్రకారుని బాగానే ఆకట్టుకుంది.

‘ఏక్ మినీ కథ’తో ఆకట్టుకున్నా అది నేరుగా ఓటీటీలో రిలీజ్ అ య్యింది. ఇక ‘విశ్వం’ సినిమా తొలి రోజు పర్వాలేదన్న టాక్ వ చ్చినా కూడా ఆ తరువాత మాత్రం ఎందుకో పెద్దగా మె ప్పించలేదు. మరి సినిమా లు ఎన్ని చేశామన్నది కా దు.. సక్సెస్ రేటు కూడా ఉండాలనేది అర్థం చేసుకుందో ఏమో కానీ విజ యం సాధించేందుకు స్లో అండ్ స్టడీగా వెళుతోందీ భామ. ప్రస్తుతానికి అమ్మ డు అయితే సినిమాల్లో జోరు తగ్గించి నెట్టింట జోష్ పెంచుతోంది.