calender_icon.png 19 April, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంబీబీఎస్‌లో యూనివర్సిటీ టాపర్ కావ్య

12-04-2025 12:00:00 AM

బెల్లంపల్లి, ఏప్రిల్ 11 : బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్‌నగర్‌కు చెందిన విద్యార్థిని దుర్గం కావ్య ఎంబీబీఎస్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచా రు. దుర్గం కావ్య హైదరాబాద్‌లోని  గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.

ఈ సందర్భంగా గాంధీ మెడికల్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్స్‌ల ర్ డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డి, మెడికల్ కళా శాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ఇందిర చేతుల మీదుగా ఎంబీబీఎస్ పట్టాను అందుకున్నారు. చదువులో మొదటి నుంచి రాణిస్తున్న కావ్య యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి 5 గోల్ మెడల్స్ పొందారు. షంషీర్‌నగర్‌లో దుర్గం రామకృష్ణ, దుర్గం విజయ దంపతుల పెద్ద కుమార్తె దుర్గం కావ్య.