- ఇందిరా పార్క్ వద్ద కాకుండా మీ నాన్న ఫామ్‌హౌస్ వద్ద ధర్నా చేయాలి
- ఎమ్మెల్సీ కవితకు ఎంపీ చామల సూచన
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవిత బీసీల కోసం ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ ఉపా ధ్యక్షుడు, ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీ నినాదం ఎత్తుకొని కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం చూస్తుం టే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఇందిరా పార్క్ వద్ద ధర్నాలే చేయనీవ్వలేదని, బీసీలను విస్మరించిన ఘతన బీఆర్‌ఎస్‌దేనని శుక్ర వారం ఆయన ఒక ప్రకటనలో ఆరో పించారు. కవిత ఇందిరాపార్క్ బదులు.. కేసీఆర్ ఫామ్‌హౌస్ ముందు ధర్నా చేస్తే బాగుంటుందని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ చేసే బీసీ కులగణన తాము ధర్నా చేయడం వల్లే వచ్చిం దని చెప్పుకోవడానికే కవిత ధర్నా పేరుతో డ్రామాలు చూస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్లలో బీసీలను పట్టించుకున్న దాఖలాలు లేవని, బీసీలను విస్మరిం చారని ఆయన మండిపడ్డారు.
వీ హనుమంతరావు, కేశవరావు, డీ శ్రీనివాస్, ప్రస్తుతం మహేశ్‌కుమార్ గౌడ్ లాంటి బీసీ నేతలను పీసీసీ అధ్యక్షులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. బీఆర్‌ఎస్‌కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే.. పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నారు. కవితకు ధర్నా చేసే అధికారం కూడా లేదన్నారు. కవిత కూడా కులగణన లో భాగస్వాములై సహకరించాలని, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ఎంపీ సూచించారు.