calender_icon.png 20 April, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు కవిత బహిరంగ క్షమాపణ చెప్పాలి

10-04-2025 04:32:15 PM

బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్..

మందమర్రి (విజయక్రాంతి): బీసీల హక్కుల కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమిస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో ఢిల్లీలో జరిగిన బీసీల పోరు గర్జన సభ విజయాన్ని ఓర్వలేక  ఎమ్మెల్సీ కవిత బీసీ లపై అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకోవాలని  బీసీ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పదేండ్లు అధికారంలో ఉండి  ఏనాడూ బీసీల కోసం పాటుపడకుండా కనీసం పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేని వాళ్ళు నేడు అధికారం పోగానే బీసీల పట్ల చూపించే కపట ప్రేమను బీసీ సమాజం గమనిస్తుందన్నారు. ఓ వైపు బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటేనే మరో వైపు బీసీల కోసం ఏర్పాటు చేసిన సభలను కించపరిచేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్సీ కవిత  ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాల న్నారు. బీసీ పోరు గర్జన సభ పట్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి బీసీల ఉద్యమానికి మద్దతు తెలిపి తన చిత్తశుద్ధి నిరూపించు కోవాలని ఆయన హితవు పలికారు.