calender_icon.png 19 April, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ నాయకులను బెదిరించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

15-04-2025 07:11:21 PM

వారి పేర్లు పింక్ బుక్ లో రాస్తున్నాం..

ఎవరిని ఉపేక్షించేది లేదు.. 

ఎమ్మెల్సీ కవిత వార్నింగ్.. 

కామారెడ్డి (విజయక్రాంతి): బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మంచివారు అయి ఉండొచ్చు కానీ తాను కొంచెం రౌడీ టైపు అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లొద్దని కొందరు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లన్నింటినీ పింక్ బుక్కులో రాసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ రజాతోత్సవ సన్నాహక సమావేశంలో మంగళవారం పాల్గొన్న కవిత మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ నేతలను ఎవరెవరు బెదిరిస్తున్నారు తమకు తెలుసని వాళ్ళ పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటామన్నారు. బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని, కేసులు పెట్టించే వారిని పోలీసు స్టేషన్కు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

టిఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు అధికారులు ఎవరైనా ఉరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు ఇక్కడ భయపడే వారెవరు లేదన్నారు. కాంగ్రెస్ వాళ్ళ తాతలు, ముత్తాతలు, జేజమ్మలు, ఎవరు దిగొచ్చినా కూడా భయపడే వాళ్ళు లేదని వ్యాఖ్యానించారు. మాట తప్పడం మడత తిప్పడమే కాంగ్రెస్ నైజం అని సోనియా గాంధీ రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్డులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ పంచి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. ఇప్పుడు గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డల ఆత్మబలి దానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత ముట గట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని సెటైరు వేశారు. ఈ సమావేశంలో బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.