calender_icon.png 26 January, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవిత బెయిల్‌పై విచారణ వాయిదా

23-07-2024 03:55:00 AM

  1. సాధారణ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు
  2. విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసిన కోర్టు
  3. 86 రోజులుగా సీబీఐ కస్టడీలో ఎమ్మెల్సీ 

న్యూ ఢిల్లీ, జూలై 22: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ జరిగింది. 60 రోజుల గడువులోపు పూర్తి ఛార్జిషీటు దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైందని ఆమె తరఫున న్యాయవాదులు తెలిపారు. జూలై 8వ తేదీన పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సీఆర్‌పీసీ 167(2) ప్రకారం కవిత సాధారణ బెయిల్‌కు అర్హురాలు అని వాదించారు.

ఆమె ఎదుర్కొన్న అభియోగాలకు ఏడేళ్ల జైలు శిక్ష, గరిష్టంగా 60 రోజుల కస్టడీ అవకాశం ఉంటుందన్నారు. అయితే కవిత జూలై 6 నాటికి 86 రోజుల కస్టడీని పూర్తిచేసింది. అందువల్ల సాధారణ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. విచారణ సందర్భంగా సీబీఐ అసంపూర్ణ చార్జిషీట్ దాఖలు చేయటంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు 5న చేపడతామని కోర్టు వెల్లడించింది. దీంతో కవిత అప్పటివరకు జైల్‌లోనే ఉండనున్నారు.