calender_icon.png 22 April, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీదే

21-04-2025 06:07:16 PM

మోసపూరిత వాగ్దానాలతో అధికారులకు వచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు 

భద్రాచలంలో ఉద్యమకారుల సదస్సులో పాల్గొని మాట్లాడిన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 

భద్రాచలం,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, గులాబీ దండు, తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని ప్రజల్ని నుండి వేరు చేయడం ద్వారా రాష్ట్రాన్ని కాపాడాలని రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Jagruthi President Kalvakuntla Kavitha) పిలుపునిచ్చారు. భద్రాచలంలోని టూరిజం హోటల్లో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఉద్యమకారుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారులకు మధ్య రక్తసంబంధం, పేగు బంధం ఉందని, ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ ఆవిర్భవించేది కాదని కొనియాడారు. గతంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమకారులు పనిచేశారో, ఇప్పుడు కూడా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 1969లో తొలిబీజం పడింది ఖమ్మం జిల్లాలోనే నని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయాలని తలంపుతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశారని కవిత పేర్కొన్నారు. ఆ సమయంలో పార్టీ నేతలకన్నా ప్రజలకు మంచి చేయాలని తలంపుతో పని చేశారని అన్నారు. ప్రస్తుతం పాత, కొత్త తరం నాయకులు పార్టీలో ఉన్నందున అందరూ బాధ్యతతో ముందుకు వెళ్లాలని అన్నారు. కార్యకర్తలకు నాయకులకు ఎవరికి సమస్య వచ్చిన ప్రచారం మాధ్యమాలు వాట్సప్,   ట్విట్టర్ ద్వారా నాకు తెలియజేస్తే మీ విషయం పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు కి తెలియజేసి పరిష్కరిస్తానని  ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కార్యకర్తలను ప్రస్తుత నాయకత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయి.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలను ఉద్యమకారులను ప్రస్తుత నాయకత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని దీనిపై ఆలోచించి న్యాయం చేయాలని పలువురు ఉద్యమకారులు కవిత దృష్టికి తీసుకువచ్చారు. గతంలో పనిచేసిన టిఆర్ఎస్ మంత్రులు టిఆర్ఎస్ కార్యకర్తలను ఉద్యమకారులను పూర్తి నిర్లక్ష్యం చేశారని, వారి వారి అనుమాయులను పార్టీలో నింపుతూ అసలు పార్టీ కోసం పని చేసిన వారి పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని భూ ఇప్పటికైనా జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని కోరారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ తాత మధు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, దిండిగల రాజేందర్, వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలం నియోజకవర్గం నాయకులు రావులపల్లి రాంప్రసాద్ బి. బుచ్చయ్య, మానే రామకృష్ణ సునీల్ , పూర్ణ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.