calender_icon.png 1 January, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవితకు మళ్లీ నిరాశే

01-08-2024 02:14:15 AM

13వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ, జూలై 31: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ వేర్వేరుగా నమోదుచేసిన కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగింది. సీబీఐ కేసులో ఆగస్టు 9వ తేదీ వరకు, ఈడీ కేసులో 13వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా బుధవారం ఆదేశాలు జారీచేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలను కూడా పొడిగించింది.