మంథని (విజయక్రాంతి): మంథని మండలం కన్నాల గ్రామానికి చెందిన కావటి సతీష్ కుమార్ యాదవ్ కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ రేట్ లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్య కిషన్ రావు పర్యవేక్షణలో ఒగ్గు మందెచ్చు కళారూపాల సాహిత్యం సమ పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నాడు. సతీష్ ప్రాథమిక విద్యాభ్యాసం మంథనిలో పూర్తిచేసి పీజీ ఎంఏ తెలుగు ఎంట్రన్స్ లో ఐదవ ర్యాంకు సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి పిహెచ్ డి కూడా సాధించాడు. 10 జాతీయ సెమినార్లు ఐదు అంతర్జాతీయ సెమినార్ లలో పత్ర సమర్పణ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ జేఏసీ అధ్యక్షుడిగా పోరాటం చేసి తెలంగాణ సాధనకు ఎంతో కృషి చేసి పోలీస్ కేసులను కూడా ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంత నిరుపేద ఒగ్గు కళాకారుల కుటుంబానికి చెందిన స్వర్గీయ కావటి మల్లయ్య రాజమ్మ దంపతులకు ఆరుగురు సంతానంలో సతీష్ ఐదవ సంతానం.
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని సతీష్ నిరూపించాడు ఒగ్గు కథకుల కుటుంబంలో జన్మించి ఒగ్గు కథలోనే పీహెచ్డీ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన చదువుకు సహకరించిన తన తల్లిదండ్రులు, అక్క బావలకు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రొఫెసర్లు ఆచార్య కిషన్ రావు, సాగే కమలాకర్ శర్మ, కాసిం, సూర్య ధనుంజయ్, రఘు, విజయలక్ష్మి, వైస్ ఛాన్సులర్ నిత్యానందరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కావటి సతీష్ కు డాక్టరేట్ రావడం పట్ల ఓయూ జేఏసీ నేతలు స్నేహితులు బందువులు, ఒగ్గు కళాకారులు, కన్నాల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.