calender_icon.png 16 November, 2024 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కవచ్’ ఎంతో సేఫ్

16-11-2024 01:41:38 AM

  1. సనత్‌నగర్- వికారాబాద్ సెక్షన్‌లో 4.0 వెర్షన్
  2. ద.మ.రైల్వే పరిధిలో 1,465 కి.మీ. మేర పూర్తి 
  3. ప్రమాదాలకు చెక్ పెట్టిన రైల్వే శాఖ

హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ప్రాణనష్టంతోపాటు రైల్వే ఆస్తులకు నష్టం కలుగుతోంది. ఈక్రమంలోనే రైల్వేశాఖ తీసుకొచ్చిన కవచ్ వ్యవస్థతో ప్రమాదాలు తగ్గాయి. ‘కవచ్’ ప్రవేశపెట్టిన మార్గాల్లో ఇప్పటి వరకు రైళ్లు ఢీకొన్న ఘటనలు శూన్యం.

2014లో కవచ్‌ను రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్‌ఓ) అభివృద్ధి చేయగా.. ఆ ఏడాది నుంచే ద.మ.రైల్వే పరిధిలో కవచ్‌ను ప్రవేశపెట్టారు.  

ద.మ.రైల్వే జోన్ పరిధిలో 1,465 కి.మీ.ల కవచ్..

కవచ్ 4.0 తాజా వెర్షన్‌ను సనత్‌నగర్ వికారాబాద్ స్టేషన్‌ల మధ్య 63 కి.మీ.ల మే ర విజయవంతంగా అమలు చేసినట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం ద.మ.రైల్వేలో మొత్తం 1,465 కిలోమీటర్ల మేర పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా ఈ మార్గంలో రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట పడినట్టు అధికారులు చెబుతు న్నారు. కాగా ఇప్పటికే కవచ్ వర్షన్ 3.2 నాగర్‌సోల్- గుంతకల్ మధ్య అమల్లో ఉన్నది.  

‘కవచ్’ ప్రయోజనాలు..

* లోకో పైలట్ బ్రేక్ వేయడంలో విఫలమైతే ఆటోమేటిక్ బ్రేక్ అమలు.  

* డ్రైవర్ కేబిన్‌లో లైన్-సైడ్ సిగ్నల్ డిస్‌ప్లే.  

* రేడియో ఆధారిత నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ

* లెవల్ క్రాసింగ్ గేట్ల దగ్గర ఆటోమేటిక్ సైరన్  

* నిరంతరం ట్రైన్ టు ట్రైన్ కమ్యూనికేషన్ ద్వారా ప్రమాద నివారణ.  

* ప్రమాద సమయంలో ఎస్‌ఓఎస్ సౌకర్యం.