calender_icon.png 25 November, 2024 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కవచ్’ ఇరిసెట్ ప్రత్యేకతే

25-11-2024 01:29:21 AM

డీజీ శరద్‌కుమార్ శ్రీవాస్తవ

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): దేశంలో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటె క్షన్ సిస్టం అయిన కవచ్ రూపకల్పనతో తార్నాకలోని రైల్వే సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్ ఇన్‌స్టిట్యూషన్ (ఇరిసెట్) తన ప్రత్యేక తను చాటుకున్నదని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ శరద్‌కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరి సెట్ 67వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు.

దేశంలోని అనేక రైళ్లను ఈ కవచ్ వ్యవస్థ ప్రమాద రహితంగా మార్చిందని.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే కాకుండా రైల్వే ఆస్తుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. ఇరిసెట్‌లో 1.12లక్షల మందికి సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్‌లో శిక్షణ అందించినట్లు తెలిపారు. విదేశీయు లు సైతం ఇక్కడ శిక్షణ పొందినట్టు గుర్తు చేశారు.

బీటెక్ విద్యార్థులకు శిక్షణ కోసం 3 విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడిం చారు. కవచ్ టెక్నాలజీపై నిరంతరం పరిశోధన చేస్తూ మరింత ఆధునికతను పెంపొంది స్తున్నట్లు డీజీ వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో పలు పరిశోధనలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

అనంతరం అత్యు న్నత ప్రతిభ కనబర్చిన 12 మంది ట్రైనీ ఇం జినీర్లకు ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అవార్డులను అందజేశారు. కార్యక్రమం లో ఐఐటీ మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డా.గంటి రాధాకృష్ణ, రైల్వేబోర్డు అదనపు సభ్యులు విజయలక్ష్మి కౌశిక్, సమీర్‌దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.