హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): మహిళలను అవమానించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు. బుధవారం వారు తెలంగాణ భవన్ ముట్టడించి ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు తెలంగాణ భవన్ వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి.. మహిళా కార్యకర్తలను అడ్డుకున్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యాఖ్య లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.