calender_icon.png 17 January, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు బీఆర్ఎస్ తడాఖా చూపిస్తాం: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

12-09-2024 02:15:10 PM

ఎమ్మెల్యేకే రక్షణ లేదు.. ప్రజల సంగతేంటి?

నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డను

హైదరాబాద్‌: ఎమ్మెల్యేకే రక్షణ లేదు.. సామాన్య ప్రజల సంగతేంటి? అని హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. హత్య చేయడానికి తన ఇంటి వద్దకు వచ్చారని ఆరోపించారు. రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ తడాఖా చూపిస్తామని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ అరెకపూడి గాంధీ చేసిన చర్యకు రేపు ప్రతిచర్య ఉంటుందని కౌశిక్ రెడ్డి తేల్చిచెప్పారు.

అరెకపూడి గాంధీ కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ కు వచ్చారన్న కౌశిక్ రెడ్డి తాను నిఖార్సయిన తెలంగాణ బిడ్డనని తెలిపారు. మహిళలపై కూడా దాడి చేశారని ఆయన వాపోయారు. ఇవాళ హత్య చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నా ఇంట్లో నేను ఉంటే దాడి చేశారు. దాడి విషయాన్ని సీసీ దృష్టికి తీసుకెళ్లాలని ఫోన్ చేస్తే ఎత్తలేదని కౌశిక్ రెడ్డి విమర్శించారు. రేపు ఉదయం 11 గంటలకు అరెకపూడి గాంధీ ఇంటికెళ్లి గులాబీ కండువా కప్పుతా, రేపు బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపుతామని  కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.