స్పీకర్‌కు కాంగ్రెస్ మహిళా నేతల ఫిర్యాదు
హైదరాబాద్,సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపర్చేలా కౌశిక్‌రెడ్డి ప్రవర్తించారని, ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయకుంటే సమాజంలో మహిళలకు మరింత అవమానం జరిగే ప్రమాదం ఉందన్నారు. బీఆర్‌ఎస్ నేతలకు మహిళలంటే గౌరవం లేదన్నారు.
గతంలో కేటీఆర్ కూడా మహిళలను కించపర్చే విధంగా మాట్లాడారని ఆమె గుర్తు చేశారు. స్పీకర్‌ను కలిసి వారిలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత, పీసీసీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి, కార్పొరేటర్ పారిజాతరెడ్డి, వరలక్ష్మి తదితరులు ఉన్నారు.