* స్పీకర్‌పై పేపర్లు విసిరిన నీచ సంస్కృతి కౌశిక్ రెడ్డిదే
* ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హుజురాబాద్, డిసెంబర్22: దళితులు నయవంచన చేసి మోసం చేసిన ఘనత హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంటలో ఆదివారంఓ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ.... జమ్మికుంట కొత్తపెళ్లి రైల్వే బ్రిడ్జి సమస్య మహిళలు తన వద్దకు తీసుకురావడంతో హుజురాబాద్ నియోజ కవర్గ స్థాయి నాయకుడు ప్రణవ్ బాబుతో కలిసి సెంట్రల్, రాష్ర్టం నుండి నిధులు తెచ్చి రైల్వే బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల రైతులపై అసెంబ్లీలో చర్చ పెడతామని స్పీకర్ తీర్మానం చేస్తే కౌశిరెడ్డి మాత్రం అవినీతిపరుడైన కేటీఆర్ ను అరెస్టు ఎందుకు చేస్తారని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి దళిత స్పీకర్ పై పేపర్లు విసిరి ఆందోళన చేసిన ఘనుడు కౌశిరెడ్డి అని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే, ప్రజల సమస్యలు పక్కనపెట్టి అవినీతి పరులకు అండగా నిలుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లోని దళితు లకు దళిత బంధు ఆపింది కౌశిక్ రెడ్డి అని, నేను ఎమ్మెల్యే గెలిస్తేనే మీకు రెండో విడత దళిత బంధు వస్తుందని దళితులకు మాయమాటలు చెప్పింది నీవు కాదా అని ప్రశ్నించారు.
ఉపఎన్నికల్లో హుజురాబాద్ బహిరంగ సభకు శాలపల్లి నుండి దళితులు వస్తుంటే రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నేను మృతదేహాలతో ధర్నా చేస్తే వారికి పది లక్షల ఎక్సగ్రేషియా ఇస్తామని మీ నాయకులు నీవు చెప్పి ఇప్పటివరకు కూడా ఆ కుటుంబాలను ఆదుకోలేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఎలాంటి పేపర్ లేకుండా డబ్బులు వసూలు చేసి మోసం చేసింది నువ్వు కాదా అని అన్నారు. అసెంబ్లీలో రైతులు, ప్రజల సమస్యలపై కొట్లాడు కుంటే నీకు హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కసబుసుల వెంకన్న, శ్రీనివాస్, పర్లపల్లి నాగరాజ్, శ్రీకాంత్, తో పాటు తదితరులు ఉన్నారు.