- కేంద్ర నిర్ణయంతో ఏపీకి వెళ్లనున్న ప్రస్తుత కమిషనర్ ఆమ్రపాలి
- తర్వాత ఎవరనే దానిపై చర్చ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1౩ (విజయక్రాంతి): బల్దియా కొత్త బాస్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తు తం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరిం చడంతో ఆమె తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ల డం అనివార్యంగా మారింది.
ఈ క్రమంలోనే నూతన కమిషనర్‌గా ప్రభుత్వం ఎవ రిని నియమించబోతోంది అని జీహెచ్‌ఎంసీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ఏడా ది జూన్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు తీసుకున్న ఆమ్రపాలిని ఆగ స్టులో పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నాలుగు నెలలు కూడా పూర్తి చేయకుండానే రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన జీహెచ్‌ఎంసీ కమిషనర్ పోస్టుకు ఆమ్రపాలిని ప్రభుత్వం నియమించింది.
ఆమ్రపాలి స్థానంలో ప్రస్తుతం వాట ర్ బోర్డు ఎండీగా ఉన్న అశోక్ రెడ్డిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. గతంలో జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఆయ న బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.
గతంలో కృష్ణబాబు, జనార్ధన్ రెడ్డి, దానకిషోర్ వాటర్ బోర్డు ఎండీ బాధ్యతలు నిర్వహించిన తర్వాతనే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. అదే సంప్రదాయం లో ప్రస్తుతం వాటర్ బోర్డు ఎండీగా కొనసాగుతున్న అశోక్ రెడ్డిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించే అవకాశం ఉందని ప్రచారం.