calender_icon.png 19 April, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళామణుల రోదసీయాత్ర

15-04-2025 12:00:00 AM

టెక్సాస్, ఏప్రిల్ 14: అపరకుబేరుడు, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూఆర్జిన్ సంస్థ చేపట్టిన రోదసీ యాత్ర విజయవంతం అయింది. బెజోస్ సతీమణి లారె న్స్ శాంజెజ్, ప్రముఖ గాయని కేటీ పెర్రీ, జర్నలిస్ట్ గేల్, చిత్ర నిర్మాత ఫ్లున్, పౌర హక్కుల కార్యకర్త అమాండ, మాజీ నాసా శాస్త్రవేత్త ఐషాలను తీసుకుని ‘న్యూషెఫర్డ్’ స్పేస్ క్రాఫ్ట్ సోమవారం వెస్ట్ టెక్సాస్ నుంచి టేకాఫ్ అయింది. సముద్రమట్టానికి 106 కిలోమీటర్ల ఎత్తులో కొద్ది సేపు భారరహిత స్థితిని ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో ఉన్నవారంతా మ హిళలు ఆస్వాదించారు.

ఇలా పూర్తిగా మహిళలతో ఓ స్పేస్ క్రాఫ్ట్ వెళ్లడం ఈ శతాబ్దంలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1963లో ఇలా భూమి నుంచి మొత్తం మహిళామణులతో రోదసీ యాత్ర చేపట్టారు. తాజా వెళ్లిన రోదసీకి వెళ్లిన వారం తా కొత్త రికార్డు సృష్టించారు. ఈ వ్యోమ నౌక నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత పారాచూట్ల సాయంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది. బెజోస్‌కు చెందిన బ్లూఆరిజిన్ సంస్థ 2000లో ఏర్పాటైంది.