మునుగోడు (విజయక్రాంతి): చిట్యాల మండల కేంద్రంలో జరిగిన డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మునుగోడు మండలము కల్వకుంట్ల గ్రామానికి చెందిన కట్ట లింగస్వామిని ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపులను నిర్వర్తించే విధంగా జిల్లాలో ఉన్న సమస్యల మీద, మునుగోడు నియోజకవర్గంలో ఉన్న వివిధ స్థానిక సమస్యల మీద పనిచేస్తానని తెలిపారు.