calender_icon.png 23 February, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కాట్రేవుల ఐలయ్య

21-02-2025 05:03:59 PM

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన కాట్రేవుల ఐలయ్య,ప్రజాపక్షం జర్నలిస్ట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రెస్ క్లబ్ ఎన్నికలను నిర్వహించారు.

గౌరవ అధ్యక్షుడిగా కొత్తపెళ్లి రామచంద్రమూర్తి (ప్రజాతంత్ర), ఉపాధ్యక్షుడు పుల్ల రవి తేజ(ఆర్బిన్యూస్), ప్రధాన కార్యదర్శి కట్కూరి రమేష్ (ssc channel), సహాయ కార్యదర్శి బోళ్ల రాజేందర్ (ప్రజా జ్యోతి), ప్రచార కార్యదర్శి కట్కూరి శ్రీనివాస్ (నేటి ధాత్రి), కోశాధికారి శృంగారపు రంగాచారి (వరంగల్ వాయిస్), ముఖ్య సలహాదారు చింతల రమేష్, కార్యవర్గ సభ్యులు వెల్దండి సత్యనారాయణ (నవ తెలంగాణ), చింతల రాజశేఖర్ (విజయక్రాంతి), గుర్రపు రాజమొగిలి (పీపుల్స్ డైరి), బుర్ర రమేష్ గౌడ్ (మీ వార్త), మోకిడి సతీష్ (ప్రజా సాక్షి), సరిగొమ్ముల రాజేందర్ (నేటి ప్రజావాణి), మడిపడిగే సంపత్ కుమార్ (తెలంగాణ కిరణం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాట్రేవుల ఐలయ్య మాట్లాడుతూ... తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటినుంచి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.