calender_icon.png 3 April, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత కేటీ కింగ్స్

02-04-2025 09:31:39 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం మొక్కంపాడుతండా యువకులు నిర్వహించిన క్రికెట్ పోటీలో కేటీ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. కొత్తతండ, మొక్కంపాడు టీంలు ఫైనల్ లో తలపడగా, కొత్త తండ టీం విజయం సాధించింది. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ... యువత క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని అన్నారు. గ్రామలలో క్రీడల పోటీలు నిర్వహించడం వల్ల యువతలో ఐక్యతతో పాటు నైపుణ్యతను కలిగిస్తాయని అన్నారు. దాదాపు 40 టీంలు పోటీల్లో పాల్గొనగా ప్రధమ, ద్వితియ, తృతీయ, బహుమతులు ఇచ్చారు.

ప్రధమ బహుమతి కేటీ కింగ్స్ రూ.10,516, ద్వితీయ బహుమతి రూ.10,016/ మొక్కంపాడు జట్టుకు, తృతీయ బహుమతి 5,016 ఇచ్చారు. గెలుపుపొందిన టీమ్స్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్ బానోత్ రవి, మొక్కంపాడు మాజీ ఉపసర్పంచ్ మాలోత్ రాందాస్, బోడు గ్రామపెద్దలు పోతుగంటి వీరభద్రం, యువజన నాయకులు చంద్రశేఖర్, అన్వేష్, సురేష్, రాజబాబు, నిర్వహకులు రామకృష్ణదొర, బీజ్జా రవీందర్, సుభాస్, నరేష్, ప్రకాష్, రెబల్, మొక్కంపాడు యూత్ పాల్గొన్నారు.