calender_icon.png 15 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథక్ నృత్యకారిణి కుముదిని లఖియా కన్నుమూత

13-04-2025 12:41:35 AM

ఈ ఏడాది పద్మవిభూషణ్‌తో సత్కరించిన కేంద్రం

అహ్మదాబాద్, ఏప్రిల్ 12: ప్రముఖ కథక్ నృత్యకారిణి కుముదిని లఖియా (95) కన్నుమూశారు. శనివారం ఉదయం అహ్మదా బా ద్‌లో ఆమె మృతి చెందినట్టు కుటుంబసభ్యు లు పేర్కొన్నారు. కుముదిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1930లో జన్మించారు. ఈ నృత్య కళారూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 1967లో అహ్మదాబాద్ కదంబ సెంటర్ ఫర్ డ్యాన్స్ సంస్థను స్థాపించారు.

ఇందులో ఆమె చేసిన కృషికిగాను 2025లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అంతకుముందే పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు కూడా ఆమె అందుకున్నారు. కాగా కుముదిని మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘కుముదిని లఖి యా జీ మరణం ఎంతో కలచి వేసింది.

భారతీయ సంస్కృతికి మార్గదర్శకంగా నిలిచిన ఉత్తమురాలు మనందరిని విడిచి వెళ్లడం బాధాకరం. కథక్ సహా భారత శాస్త్రీయ నృత్యా ల పట్ల ఆమెకున్న మక్కువను చూస్తే ఎంతో గౌరవంగా అనిపిస్తోంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’ అని మోదీ రాసుకొచ్చారు.