22-04-2025 09:49:00 PM
కాటారం (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు టాపర్ లుగా నిలిచారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపునకు చెందిన ఇరువురు విద్యార్థులు వరుసగా వి అశ్విత 455, పి మల్లికా 431 మార్కులు కైవసం చేసుకున్నారు. అలాగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపునకు చెందిన డి అంజలి 844 మార్కులు సంపాదించుకోగా, బైపిసి గ్రూపునకు చెందిన కే సంధ్య 801 మార్కులు కైవసం చేసుకుని టాపర్లుగా నిలిచారని కేజీబీవీ ప్రత్యేక అధికారిని చల్ల సునీత తెలిపారు. కేజీబీవీ విద్యార్థుల విజయకేతనం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.