calender_icon.png 8 January, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ నిలయంగా కాటారం డివిజన్: మంత్రి శ్రీధర్ బాబు

07-01-2025 07:49:09 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): సరస్వతి నిలయంగా కాటారం మండల కేంద్రాన్ని విద్యాభివృద్ధి కేంద్రంగా చేస్తూ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి వెనుక బడిన ప్రాంత అభివృద్ధికి విద్యారంగంలో అన్ని పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేస్తానని మంత్రి శ్రీధర్ బాబు(Minister Duddila Sridhar Babu) అన్నారు. కాటారం మండల కేంద్రంలో కాటారం డివిజన్ 19 ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధాన ఉత్సవంలో మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ముందుగా కొయ్యూరు మండల కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించి, అంగన్వాడీ సూపర్వైజర్లకు ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి సహోదరి బొమ్మ వీరమ్మ ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరమర్శించారు.

అనంతరం కాటారం మండల కేంద్రంలో రూ.10 లక్షలతో కూరగాయల మార్కెట్ కు శంకుస్థాపన చేసి, కాటారంలో సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి 10 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసి, మెయిన్ రోడ్డు నుండి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు సీసీ రోడ్డుకు 15 లక్షలతో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కాటారం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం ఆదర్శ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని గత మూడు రోజుల నుంచి జరుగుతున్న క్రీడ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేసి మాట్లాడుతూ.. కాటారం మండల నా సొంత మండలమని విద్యాపరంగా అభివృద్ధి పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ విద్యాపరంగా మెడికల్, ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటుకు సాయశక్తుల కృషి చేస్తానని  విద్యార్థులకు  హామీ ఇచ్చారు.

కాటారంలో ఇండోర్ బ్యాట్మెంటన్ స్టేడియం నిర్మిస్తామని మినీ స్టేడియాన్ని కూడా నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భూపాల్ పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్  కలెక్టర్ మయంక సింగ్, కాటారం సబ్ డివిజన్ ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షుడు శ్రీశైలం, కరుణాకర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, మంజుల రెడ్డి, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ కాక రెడ్డి, మంథని డివిజన్ యూత్ అధ్యక్షుడు సందీప్, కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.