calender_icon.png 7 January, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదివేలమందికి కాటమయ్య కిట్లు

06-01-2025 01:06:33 AM

* 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ

* మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, జనవరి 5: రాష్ట్రంలో మరో పదివేలమంది గీతకార్మికులకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఈనెల 25 నుంచి రెండోవిడత కాటమయ్య సేఫ్టీ కిట్లను పంపిణీ చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రూ.18కోట్లతో చేపట్టబోయే ఎల్లమ్మచెరువు బ్యూటిఫికేషన్ పను  యాదవ భవన్, డ్రైనేజీల నిర్మాణానికి ఆదివారం పొన్నం శంకుస్థాపన చేశారు. రైతుబజార్‌తోపాటు వ్యవసాయమార్కెట్‌లో నిర్మించిన గోదాంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూ  మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్‌పర్సన్ అనిత, సింగిల్‌విండో చైర్మన్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి భోజనం

అనంతరం హుస్నాబాద్‌లోని మైనార్టీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్‌లో స్టూడెంట్స్‌తో కలిసి మంత్రి పొన్నం లంచ్ చేశారు. వారితోపాటు లైన్‌లో నిలబడి ప్లేట్ కడుక్కొని అన్నం పట్టుకున్నారు. స్టూడెంట్స్‌తో కలిసి ఆడిపాడారు. భోజనం క్వాలిటీగా లేకపోతే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని స్టూడెంట్స్‌కు సూచించారు.