calender_icon.png 28 December, 2024 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్మోహన్ సింగ్‌ ఒక చరిత్ర: పాక్ మాజీ విదేశాంగ మంత్రి

27-12-2024 04:55:05 PM

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కసూరి(Khurshid Mahmud Kasuri) గురువారం రాత్రి ఢిల్లీలో మరణించిన దివంగత భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌(Manmohan Singh)తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శుక్రవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుర్షీద్ మహమూద్ కసూరి మాట్లాడుతూ, భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పేందుకు ఎంతో కృషి చేసిన వ్యక్తిగా మన్మోహన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. నవంబర్ 2002 నుండి నవంబర్ 2007 వరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి(Foreign Minister of Pakistan)గా పనిచేసిన 83 ఏళ్ల కసూరి, సార్క్ ప్రాంతంలో సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించినందుకు కృషి చేశారని కొనియాడారు. అమృత్‌సర్‌లో బ్రేక్ ఫాస్ట్, లాహోర్‌లో లంచ్, కాబూల్‌లో డిన్నర్ చేసే రోజు కోసం వేచి చూస్తున్నానని మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఖుర్షీద్ గుర్తుచేసుకు న్నారు. మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల మధ్య సంబంధాలు బాగా పెరిగాయని, ఫలితంగా రెండు ప్రభుత్వాల మధ్య పరస్పర విశ్వాసం ఏర్పడిందని ఆయన అన్నారు.