హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాదులో ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ గా బాన్సువాడకు చెందిన కాసుల బాలరాజు బాధ్యత స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ షెట్కర్,ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.