calender_icon.png 25 March, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసుల బాలరాజ్ అసత్య ప్రచారాలు మానుకో..

23-03-2025 07:41:26 PM

మీ మనుగడకే మంచిది కాదు..

కాంగ్రెస్ నాయకులు ద్రోణవల్లి సతీష్..

బాన్సువాడ (విజయక్రాంతి): కాసుల బాలరాజు నీ అబద్ధపు ప్రచారాలు మానుకో అని కాంగ్రెస్ నాయకులు ద్రోణవల్లి సతీష్ అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో శనివారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్  కాసుల బాలరాజు మీడియా సమావేశం నిర్వహించి అసత్య ప్రచారాలు చేయడం తగదని అన్నారు. మీ వ్యక్తిత్వం సరిగా లేకపోవడం వల్లే ఇన్ని సార్లు  ఓడిపోవడం జరిగిందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డినీ తీసుకొని మీరు ఏ దైవం దగ్గరికి వచ్చిన సరే నేను అవినీతి చేయలేదు అని పచ్చి బట్టలతో దైవంపై ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని దానికి మీరు సిద్ధంగా ఉంటే రావాలని కోరారు. ఎవరు ఏమిటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని సతీష్ పేర్కొన్నారు. ఇకనైనా అబద్దాల ప్రచారాలు మానుకోవాలి హితవు పలికారు. ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయడం మీ మనగడకే మంచిది కాదు అని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి గణేష్, హైమద్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.