నటి కస్తూరికి కోర్టు 12 రోజుల పాటు రిమాండ్ విధించింది. తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారులో ఓ సినీ నిర్మాత ఇంట్లో కస్తూరి తలదాచుకున్నా రు. విషయం తెలుసుకున్న పోలీసులు హైదరాబాద్‌లో కస్తూరిని కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసుపై ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు విచారణ నిర్వహించిం ది. ఈ క్రమంలోనే కస్తూరికి 12 రోజుల పాటు రి మాండ్ విధించింది. పోలీసులు ఆమెను పుళల్ కేంద్ర కారాగానికి తరలించారు.
తీర్పు తరువాత కోర్టు నుంచి బయటకు వచ్చిన కస్తూరి విలేకరులను చూసి న్యాయాన్ని గెలిపించాలంటూ నినా దాలు చేశారు. నవంబర్ 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కస్తూరి తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిపై పెనుదు మారమే చెలరేగింది. ఆమెపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ వెంటనే కస్తూ రి ముందస్తు బెయిల్ కోరుతూ చెన్నై హైకోర్టును ఆశ్రయించగా ఆమెకు చుక్కెదురైంది.