calender_icon.png 3 March, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మె కారణంగా మూతపడ్డ కస్తూర్బా పాఠశాల

11-12-2024 04:24:12 PM

ఇల్లెందు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె బుధవారానికి రెండు రోజులకు చేరింది. అందులో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర, జిల్లా జాక్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ ఈ సమ్మెలో పాల్గొన్నారు. మండలంలో ఉన్న మండల వనరుల కేంద్రం (ఎమ్మార్సీ), కేజీబీవీ పాఠశాల మూతపడ్డాయి. మండల విద్యాధికారి జగన్ కేజీవీబీవీ పాఠశాలను సందర్శించి పాఠశాలలో ఉన్న విద్యార్థినులకు పాఠాలు చెప్పారు. ఇందులో టేకులపల్లి కేజీబీవీ ఉపాధ్యాయినులు, వర్కర్లు, ఎంఐఎస్, సిసిఓ, సిఆర్ పీలు, ఐఈ ఆర్ పీలు, మెసెంజర్స్ సమ్మెలో పాల్గొన్నారు.