calender_icon.png 25 October, 2024 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా గాంధీ విద్యాలయంలో కుక్కల్లా అరుస్తున్న విద్యార్థినిలు..

25-10-2024 12:40:52 PM

జహీరాబాద్, (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 15 మంది విద్యార్థులు కుక్కల్లా అరుస్తూ తీవ్ర అనారోగ్యాల గురయ్యారు. శుక్రవారం చికిత్స కోసం జహీరాబాద్ ఏరియా దవాఖానకు తీసుకురాగా విద్యార్థులు కుక్కల్లా అరుస్తూ ఇబ్బందులు పడ్డారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గత రెండు మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యాల గురై కుక్కల అరవడం చేస్తున్నారని తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థులను అనారోగ్యాల గురికావడంతో కేజీబీవీ పాఠశాల సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకపోగా అక్కడ చికిత్సలు చేశారు.

పరిస్థితి విషమించడంతో 11 మంది విద్యార్థినిలను జహీరాబాద్ ఏరియా దవాఖానకు తీసుకురావడం జరిగింది. తీవ్రంగా దగ్గడంతో పాటు కుక్కల అరవడం చేయడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో సరైన ఆహారం, నీరు సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు అనారోగ్యాలకు గురికావడం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు తగు విచారణ చేసి విద్యార్థినిలకు పౌష్టికాహారం అందించి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.