12-03-2025 01:38:32 AM
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, మార్చి 11: హుజూర్నగర్ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కాస్తల శ్రవణ్ కుమార్, నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.ఈ విషయం తెలిసిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు.
మంత్రి హుజూర్నగర్ చేరుకొని మాజీ కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ కుమార్ పార్థివ దేహం పై మూడు రంగుల జెండా ఉంచి, పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ శ్రవణ్ కుమార్ మరణం పార్టీకి తీరని లోటని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్న రోజుల్లో ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం పని చేశారని మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని,అలాంటి వ్యక్తి ఈరోజు మనకు దూరం అవటం చాలా బాధాకరమని అన్నారు. శ్రవణ్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రవణ్ కుమార్ కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాముల శివారెడ్డి, తన్నీరు మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.