calender_icon.png 22 February, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసిపేటను అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దాలి

22-02-2025 12:00:00 AM

కలెక్టర్ దీపక్ కుమార్ 

బెల్లంపల్లి, ఫిబ్రవరి 21 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంను 100 శాతం అక్షరాస్యత కలిగిన మండలంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని ముత్యంపల్లి గ్రామ రైతు వేదికలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన 100 శాతం అక్షరాస్యత, ఉచిత శిక్షణ కేంద్రాలను కలెక్టర్ ప్రారంభించారు.. కలెక్టర్ మాట్లాడుతూ అక్షరాస్యత కేంద్రాల ద్వారా నిరక్షరాష్యులను 100 రోజుల్లో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. మార్చ్ 31వ తేదీలోగా పూర్తి అక్షరాస్యత కలిగిన మండలముగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తామన్నారు.