బెల్లంపల్లి (విజయక్రాంతి): చెన్నూర్ లో ఈ నెల రెండున నిర్వహించిన ఎస్ జి ఎఫ్ ఐ అండర్ 14, 17 బాలుర అథ్లెటిక్స్ పోటీల్లో కాసిపేట బాలుర గురుకుల కళాశాల ప్రభంజనం సృష్టించింది. ఈ పోటీల్లో విద్యార్థులు 17 మెడల్స్ సాధించి తమ సత్తా చాటారు. 7 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించడంతోపాటు 8 మంది జోనల్ స్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 4 న లక్షెట్టిపేట ఎం జె పి బి సి(బాలుర కళాశాల) లో నిర్వహించిన అండర్ 19 అథ్లెటిక్స్ బాలుర రాష్ట్రస్థాయి పోటీల్లో షాట్ పుట్ విభాగంలో ఆదర్శ్ (సి ఈ సి, సెకండ్ ఇయర్) గోల్డ్ మెడల్, నిఖిల్ (సీఈసీ, ఫస్ట్ ఇయర్) సిల్వర్ మెడల్, 200 మీటర్స్ అండర్ 19 విభాగంలో కె.శేఖర్ (సి ఈ సి, ఫస్ట్ ఇయర్) సిల్వర్ మెడల్, 400 మీటర్స్ విభాగంలో తేజస్ (సి ఈ సి, ఫస్ట్ ఇయర్) బ్రాంజ్ మెడల్ సాధించారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ వూటూరి సంతోష్ కుమార్, పిడి హరీష్, పిఈటి ఏ.రాజేందర్ లతో పాటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.